టైగర్‌ నాగేశ్వరరావు’గా థియేటర్లలో సందడి..

టైగర్‌ నాగేశ్వరరావు’గా థియేటర్లలో సందడి చేస్తున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ తెరకెక్కించారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు..గాయత్రి భరద్వాజ్‌, నుపూర్‌ సనన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ”ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

జీవీ ప్రకాష్‌ నేపథ్య సంగీతం, మది విజువల్స్‌, అవినాష్‌ కొల్లా ఆర్ట్‌ వర్క్‌… ఇలా అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకి యాక్షన్‌ మరో ఆకర్షణ. పీటర్‌ హెయిన్స్‌ చేసిన ట్రైన్‌ ఎపిసోడ్‌, రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ చేసిన మిగతా ఫైట్లు బాగా కుదిరాయి.

ఈ చిత్రంలో జిషు సేన్‌ గుప్తా, అనుపమ్‌ ఖేర్‌, రేణు దేశాయ్‌ తదితరులంతా అద్భుతంగా చేశారు. విక్రమ్‌ రాథోడ్‌ తర్వాత నాకు మళ్లీ అంతటి సంతృప్తినిచ్చిన పాత్ర ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమాని గొప్పగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు. ”ఈ చిత్రానికి మేము ఊహించిన స్పందన రావడం ఆనందాన్నిచ్చింది…ఇది ప్రేక్షకుల సినిమా. వాళ్లే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అన్నారు దర్శకుడు వంశీకృష్ణ. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ”దర్శకుడు వంశీ ఏదైతే చెప్పారో దాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. ప్రేక్షకుల స్పందన, వసూళ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి” అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్‌ కూచిభొట్ల, మయాంక్‌ తదితరులు పాల్గొన్నారు…