దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు….తైవాన్ అంతటా సైనిక సైరన్లు…!!!
తైవాన్ని రెచ్చగొడుతున్న చైనా..!!!
దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు డ్రాగన్ కంట్రీ మరోవైపు తైవాన్ వరుసగా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ అంతటా సైనిక సైరన్లు వినిపిస్తున్నాయి. దీంతో ద్వీప దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తైవాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అమెరికా ప్రజా ప్రతినిధులు త్వరలో తైవాన్ పర్యటనకు రానున్నండంతో బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా చట్ట సభ్యులు తైవాన్‌లో పర్యటిస్తే యుద్ధం తప్పదని డ్రాగన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా హూంకరించింది..దక్షిణ చైనా సముద్రంలో రోజు రోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తైవాన్ విషయంలో చైనా దూకుడు పెంచింది. వాయు, సముద్ర మార్గాల్లో సైనిక విన్యాసాలను తీవ్ర చేసింది. తైవాన్ పరిధిలోని సముద్ర జలాల్లోకి బీజింగ్ విమానాలు దూసుకెళ్తూ తైపీపై ఒత్తిడి పెంచుతోంది. చైనాకు దీటుగా తైవాన్ సైతం సైనిక విన్యాసాలను చేపట్టింది. భారీగా సాయుధ వాహనాలను సమీకరించి విన్యాసాలను తైవాన్ ఆర్మీ నిర్వహిస్తోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ ఆధ్వర్యంలో సంయుక్తం విన్యాసాలు నిర్వహిస్తుండడంతో దేశమంతటా సైరన్లు వినిపిస్తున్నాయి. చైనా తరచూ తైవాన్‌ను రెచ్చగొట్టే విధంగా సైనిక విన్యాసాలు చేస్తోందని తైవాన్ ఆరోపిస్తోంది అందుకే తమ బలగాలు కూడా సైనిక విన్యాలు చేపట్టినట్టు తెలిపారు. అటు చైనా, ఇటు తైపీ దళాల విన్యాలతో తైవాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు..