టమాటా ప్రస్తుతం రేటు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు….!!!

ఇటీవల కాలంలో ఆకాశాన్నంటిన టమాటా ప్రస్తుతం రేటు తెలిస్తే అవ్వక తప్పదు.. గతంలో మార్కెట్లో కిలో టమాటా ఏకంగా రూ.130 రూపాయలు పలికింది.. కానీ ప్రస్తుతం.. ఆంధ్రలో
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకుంటున్నారు… లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో వచ్చింది. వి.కోట మండలం మూడు రాష్ట్రాల కూడలిలో ఉంది.
ఇటు బెంగళూరు… అటు చెన్నై మరోవైపు హైదరాబాద్ ఉండడంతో పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడకు వచ్చి విక్రయాలు సాగిస్తారు. ప్రస్తుతం రోజూ దాదాపు 200 టన్నులకు పైగా సరుకు వస్తున్నా… ధర మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల కిలో 150 వరకు టమాటా పలికింది. అయితే ఇప్పుడు ఆరేటు కాస్తా ఐదు రూపాయలకంటే దిగువకు పడిపోయింది…తెచ్చిన పంటను అమ్మినా… కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు రైతులు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పన కోసం ఈ-ఫామ్‌ మార్కెట్‌ పేరిట నాణ్యమైన పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ప్రస్తుతం టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పశ్చిమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు…