సీఎం కేసీఆర్‌తో ఉన్న దురంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా స్పందించారు.

తాను ఇగోయిస్ట్‌ను కాదని.. ఎనర్జిటిక్ గవర్నర్‌నని స్పష్టంచేశారు...

కేసీఆర్‌తో ఉన్న దురంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా స్పందించారు. తాను ఎవరితో దూరం ఉండేలా చుడానని, అలాగే జరగా కుడదనే కోరుకోనన్నారు. దూరం గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తాను ఇగోయిస్టును కాదంటూ పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు… తాను ఇగోయిస్ట్‌ను కాదని.. ఎనర్జిటిక్ గవర్నర్‌నని స్పష్టంచేశారు. ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించానని.. వచ్చిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. రాని వారి గురించి తాను బాధపడనని అన్నారు. తెలంగాణ ఆడపడచుగా తాను అందరికీ ఆహ్వానాలు పంపానన్నారు…సీఎం కేసీఆర్‌తో గ్యాప్ గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను చాలా ప్రెండ్లీ గవర్నర్‌నని ఎవరితో గ్యాప్ పెట్టుకోవాలని కోరుకోనని స్పష్టంచేశారు. దూరం పై గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తన ఆహ్వానాలను వరుసగా పట్టించుకోకపోవడం చూస్తుంటే కేసీఆర్ నిజంగానే గ్యాప్ పెంచుకున్నట్లు అనిపిస్తుందన్నారు. అయితే దీనికి తాను బాధపడనన్నారు. అటు యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా తాను అక్కడకు వెళ్లాలని కోరుకున్నట్లు తమిళిసై తెలిపారు.
అయితే అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో వెళ్లలేకపోయినట్లు చెప్పారు.