తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపిస్తోంది…. గవర్నర్ తమిళిసై…

తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం ...

తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన చెందారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా.. రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించానని, అలాగే చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు కూడా చేశానని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశం కొదిసేపటి క్రితమే ముగిసింది. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుంచి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి ప్రధానికి గవర్నర్ వివరించినట్టు సమాచారం. ప్రధానిని కలిసిన అనంతరం గవర్నర్ తమిళిసై విలేకరులతో మాట్లాడుతూ… ‘నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. లేడీ గవర్నర్‌ను అవమానిస్తున్నారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. వ్యక్తిగతంగా నన్ను అవమానించిన భరిస్తా.. కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించా. అలాగే చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశా. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి. వరంగల్ ఆస్పత్రి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

‘గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది నా విచక్షణాధికారం. కౌశిక్ రెడ్డి పేరు సిఫారసు పైన నేను సంతృప్తి చెందలేదు. గతంలో ఇద్దరి పేర్లను ఆమోదించారు. నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలి. సీఎం ఏ విషయం పైన అయినా సరే నాతో నేరుగా వచ్చి చర్చించవచ్చు. కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేసాను, పుదుచ్చేరి-తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను. ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడాను’ అని గవర్నర్ చెప్పారు. …