మళ్ళీ ఢిల్లీకి చేరిన తెలంగాణ గవర్నర్ తమిళి సై….

మళ్ళీ ఢిల్లీకి చేరిన తెలంగాణ గవర్నర్ తమిళి సై తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించినట్టు తెలుస్తోంది. పది రోజుల కిందటే రెండ్రోజుల పాటూ ఢిల్లీకి వెళ్లి వచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రధాని నరేంద్ర మోఢీ, కేంద్ర అమిత్ షాలతో గత పర్యటనలో భేటీ అయి పలు విషయాలు వారికి వివరించి వచ్చారు…రాష్ట్రంలోని పలు అంశాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు తమిళి సై సౌందరరాజన్. మరోసారి తమిళసై ఢిల్లీ పర్యటనలో వుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు తమిళిసై. రేపు మరోసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుందని ఢిల్లీ సమాచారం. ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పెరుగుతున్న దూరం నేపథ్యంలో కేంద్రంతో ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది అంతుచిక్కడం లేదు. గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత బహిరంగంగానే ఆమెపై విమర్శలు చేశారు పలువురు తెలంగాణ మంత్రులు…