గవర్నర్ తమిళిసై తీరుపై మండిపడ్డ మంత్రి కొప్పుల..

*గవర్నర్ తమిళిసై తీరుపై మండిపడ్డ మంత్రి కొప్పుల..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
సోమవారం నాడు ధర్మారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధి గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడుతూ గవర్నర్ తమిళ సై గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తూ, రాజకీయ పార్టీ నాయకురాలిగా పని చేస్తుందని మంత్రి అన్నారు.

గౌరవ ప్రదమైన.. ఉన్నత విలువలు గలిగిన పదవిలో కొనసాగుతూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు.
ఇది సాంప్రదాయ విలువలకు విరుద్దమని, గవర్నర్ వ్యవస్థకే కళంకితం తీసుకు వస్తున్నారని అన్నారు. కేబినెట్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ సొంత ఎజెండాతో పని చేస్తందని..గతంలోనూ చాలా సందర్బాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్అణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ఏ గవర్నర్ ఈ విధంగా వ్యవహరించలేదన్నారు.

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చతెచ్చే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తీరుమార్చుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.