తమిళనాడులో బయటపడ్డ కొత్త వైరస్..

2019లో ప్రపంచం మొత్తాన్ని కోవిడ్( covid) గడగడలాడించింది. ప్రపంచం అంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇళ్లకే పరిమితమయ్యారు.
మరో రాష్ట్రంలో కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. అది కూడా కేరళ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడులో.

తమిళనాడులో( tamilnadu) బయటపడ్డ కొత్త వైరస్ ఆందోళనను పెంచుతోంది. ఆ వైరస్‌ను ప్రస్తుతం ‘ఫ్లూ వైరస్’గా( flu virus) పిలుస్తున్నారు. వేగంగా విజృంభిస్తున్న వైరస్ ప్రభావంతో జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు( tamilnadu) సర్కార్.. మాస్క్ లేకుండా ఎవరు బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. కోయింబత్తుర్ జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండడంతో.. ఆ జిల్లావ్యాప్తంగా అలెర్ట్ జారీ చేసిన కలెక్టర్.. పక్క జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా ఈ ఫ్లూ వైరస్( flu virus cases) కేసులు నమోదవుతున్నాయి. ఇది కూడా సేమ్ వైరస్ లానే ఉందని అయితే కాస్త వైరస్ తీవ్రతలో తేడాలున్నాయని తెలిపారు.

ముందుగా జ్వరం( fever) వస్తోంది. ఆ తర్వాత ఒళ్లునొప్పులు.. ఈ రెండు లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ లక్షణాలే అనుకుని వైద్యులు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత కొత్త లక్షణాలు బయటపడటంతో వైద్యులు సైతం ఆందోళన పడ్డారు. ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి రావడం ఈ ‘ఫ్లూ వైరస్’ లక్షణాలుగా ఉన్నాయి.

చిన్నపిల్లలు, వృద్దులలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ చిన్నారులు, యాభై ఏళ్ళ పైబడ్డ వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కోయంబత్తూర్ లో ఎక్కువగా ఫ్లూ వ్యాప్తి జరుగుతుందని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మాస్క్ లేకుండా ఎవరు బయటకు రాకూడదని తెలిపింది. కాని కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.