తమిళనాడు ఘోర ఘటన చోటు చేసుకున్నది..

తమిళనాడు ఘోర ఘటన చోటు చేసుకున్నది.. పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా.. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.