తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో సీఎం స్టాలిన్‌ బ్యానర్‌..

తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో సీఎం స్టాలిన్‌ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ‘ప్రైడ్‌ ఆఫ్‌ తమిళనాడు’కు బదులుగా ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ (Bride Of Tamil Nadu ) అని తప్పుగా ఆ బ్యానర్‌లో పేర్కొన్నారు. ఈ బ్యానర్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ప్రకటనలు, బ్యానర్లలలో తప్పుల వల్ల తమిళనాడు ప్రభుత్వం వరుసగా నిందలపాలవుతున్నది. ఆ రాష్ట్రంలో ఇస్రో చేపడుతున్న రెండో రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం నిర్మాణానికి సంబంధించి, వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో భారత్‌ రాకెట్‌కు చైనా జెండా ఉండటం వివాదానికి దారి తీసింది..కాగా, ఇది మరిచిపోకముందే మరో పొరపాటు జరిగింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ‘తమిళనాడు పెళ్లికూతురు’గా అభివర్ణించింది. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అనే పదాలతో ఉండాల్సిన బ్యానర్‌ను ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ అని తప్పుగా ముద్రించారు. అయినప్పటికీ ఈ బ్యానర్‌ను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశారు..మరోవైపు ఈ బ్యానర్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. తమిళనాడు ఇంగ్లీష్‌ బాగా ఉందని ఒకరు, ‘తమిళనాడు వధువు’ స్టాలిన్‌ అయితే ‘వరుడు ఎవరు?’ అని మరొకరు వ్యాఖ్యానించారు.