తమిళనాడు రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడి…

*తమిళనాడు రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడి.*

చెన్నైలోని గిండీలోని గవర్నర్‌ హౌస్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించిన ప్రముఖ రౌడీ కరుక్క వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

మూడు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించిన కరుక్క వినోద్‌ .

తదుపరి విచారణ కొనసాగిస్తున్న పోలీసు అధికారులు…

గేట్ల పై బాంబులు విసురుతున్న సమయంలోనే అతడిని పట్టుకున్నామని వెల్లడించారు. కాగా.. ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. శాంతిభద్రతల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రోడ్లపై క్రిమినల్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు అదుపు చేయడం, శాంతిభద్రతలు పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడి జరిగింది…

చెన్నైలోని గిండీలోని గవర్నర్‌ హౌస్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించిన ప్రముఖ రౌడీ కరుక్క వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించినట్లు కరుక్క వినోద్‌ అంగీకరించాడు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 25) సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్ భవన్ గేట్ నంబర్ వన్ వద్దకు వచ్చిన ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబును విసిరాడు. రాజ్ భవన్ గేట్ సెక్యూరిటీ పోలీసులు నిలబడి ఉండగా, అకస్మాత్తుగా తన చేతిలోని పెట్రోల్ బాంబు విసరడంతో అది గేటు దగ్గర పడిపోయింది. దీంతో భయాందోళనకు గురైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.