తమిళనాడు లో వింత మొక్కు పాడెపై శవంలా వచ్చిన ఓ భక్తుడు అమ్మవారి మొక్కు……

తమిళనాడు లో వింత మొక్కు పాడెపై శవంలా వచ్చిన ఓ భక్తుడు అమ్మవారి మొక్కు…..

తమిళనాడు లో వింత ఆచారాలకి కొదవే ఉండదు… కొన్ని సందర్భాల్లో ఎవరు ఆచారాలు నైనా తప్పనిసరిగా అందరూ గౌరవించాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. జిల్లాలోని జారికొండలాంపట్టి మారియమ్మన్ కాళియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ భక్తుడు శవంలా వేషం ధరించి అమ్మవారి మొక్కు తీర్చుకున్నాడు. తొలుత కొండలాంపట్టిలోని బస్టాండ్‌లో పందిరి వేసి మరి భక్తుడికి శవంలా మారి ఊరేగింపుగా బయల్దేరారు .. అంతటితో ఆగకుండా అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి అంతిమయాత్ర నిర్వహించారు. పాడెపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్లిన కోడిని పూడ్చిపెట్టి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పాడెపై నుంచే భక్తుడు అమ్మవారిని దర్శించుకున్నాడు. విచిత్రంగా జరిగిన ఈ మొక్కు చెల్లింపును చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు…. ప్రస్తుతం ఇది నెట్ లో వైరల్ గా మారింది…