తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు…జూనియర్ ఎన్టీఆర్.

తారకరత్న పోరాడుతున్నారు…

తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు…

తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది…
తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు పరామర్శించారు. వారితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 27వ తేదీన దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుందని అన్నారు. తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు.తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం…త్వరలోనే తారకరత్న కోలుకుంటారు…కర్ణాటక హెల్త్ మినిస్టర్, తనకు ఆప్తులైన సుధాకర్‌‌కు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు. ఆయన కూడా ఈ పరిస్థితుల్లో తన వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని తెలిపారు. మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అలాగానీ క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదన్నారు. అయితే చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. ఎక్మో సాయంలో తారకరత్న లేరని అన్నారు. కుటుంబ సభ్యునిగా తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. డాక్టర్లు తనకు ధైర్యం ఇచ్చారని.. అదే ధైర్యాన్ని తాను అభిమానులకు చెబుతున్నానని అన్నారు.