TARAKA RATNA HEALTH UPDATES..
యువగళం పాదయాత్ర కుప్పం..
నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌తోపాటు తారకరత్న కుప్పం మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు వస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారని..
చంద్రబాబు నాయుడు ఆరా..!
సినీనటుడు నందమూరి తారకరత్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తారకరత్నకు పల్స్ పడిపోవడంతో హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు.
వెంటనే డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు…