సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత..

సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత.

జనవరి 27 న గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.నందమూరి హీరో తారకరత్న
(Taraka Ratna)(39) కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది..