తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల…

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల.

పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న ఆసుపత్రి వర్గాలు..

*బెంగుళూరు..
▪️నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది.

▪️తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వివరించారు.

▪️తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు.

▪️ తారకరత్నకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించనేలేదని వివరించారు.