టర్కీ భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య…

టర్కీ, సిరియాలో ఫిబ్రవరి 6న సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించగా, సిరియాలో 5,914 మంది చనిపోయారని స్థానిక ప్రభుత్వాలు తెలిపాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1.60 లక్షల భవనాలు, 5.20 లక్షల అపార్టుమెంట్లు దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 15 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని, వారికోసం 5 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని UNO అంచనా వేసింది.