తారకరత్నకు కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు…

తారకరత్నకు కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్తానంలో తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కలిచివేశాయి. కాగా..తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ, బాలకృష్ణ, ఇతర బంధువులు మోశారు. భారమైన హృదయాలతో తారకరత్నకు చంద్రబాబు, లోకేష్, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు..