టాస్మాక్‌ సంస్థ రెండు కొత్త రకం బీర్ల..

టాస్మాక్‌ సంస్థ మందుబాబులకు దీపావళి స్పెషల్‌(Diwali Special)గా మద్యం దుకాణాలల్లో రెండు కొత్త రకం బీర్ల అమ్మకాలను ప్రారంభించింది.బుధవారం రాత్రి ‘థండర్‌బోల్ట్‌’ పేరు తో కొత్తరకం బీర్ల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ బీరు బాటిల్‌ ధర రూ.160. ఇదే విధంగా శుక్రవారం రాష్ట్రమంతటా మద్యం దుకాణాల్లో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో మరో కొత్త రకం బీరును కూడా ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా మందుబాబులు కొత్త రకం బీర్ల కోసం ఎగబడుతుండటంతో డిసెంబర్‌లోపున ఐదు కొత్త రకం బీర్లను కూడా ప్రవేశపెట్టేందుకు టాస్మాక్‌ సంస్థ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు..