హిజాబ్ వివాదంపై స్పందించిన బండి సంజయ్…

హిజాబ్ వివాదంపై స్పందించారు బండి సంజయ్. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం ఆడ బిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్న త్రిబుల్ తలాక్ ను మోడీ సర్కార్ రద్దు చేసిందన్నాు. తలాక్ తలాక్ అనే మూడనమ్మకాన్ని మోడీ పక్కకు పెట్టారన్నారు. త్రిబుల్ తలాక్ ను మోడీ రద్దు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం ఆడ బిడ్డలు బ్రమ్మ రథం పడుతున్నారన్నారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకాకుండా ఫత్వా జారీ చేసేందుకు MIM సిద్దమైందన్నారు బండి సంజయ్. MIM ఆగడాల పై ముస్లిం సమాజం ఆలోచించాలన్నారు..