మోడీ సభకు డుమ్మా కొట్టిన బీజేపీ సీనియర్లు..

*🔹మోడీ సభకు డుమ్మా కొట్టిన బీజేపీ సీనియర్లు.*

_• ప్రధాని టూర్లో కనిపించని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి._

_కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఇరువురు నేతలు._
*• కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం.!!..
ఆదివారం బీజేపీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజా గర్జన’ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అయితే ఈ సభకు ఆ పార్టీలో ముఖ్య నేతలు హాజరుకాలేదు…

తెలంగాణ రాజకీయాలు పదునెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఎన్నికల కదనరంగంలోకి దిగిపోగా పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ సభతో బీజేపీ సైతం ఎన్నికల సమర శంఖం పూరించింది… తెలంగాణ ప్రజలపై ప్రధాని హామీల వర్షం కురిపిస్తూనే బీఆర్ఎస్‌పై విమర్శల దాడికి దిగారు. దీంతో ఇక రాష్ట్రంలో కమలం దూకుడు ఖాయం అనుకునే లోపు బీజేపీలోని ఓ వర్గం వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలాల్లో చర్చనీయాశంగా మారింది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ సభ అంటే దానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ సభలో కనిపించేందుకు నేతలతో పాటు సామాన్య కార్యకర్త సైతం ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది నిన్న జరిగిన మోడీ సభకు బీజేపీలో ముఖ్యమైన నేతలుగా ఉన్న ఎంపీ సోయం బాపురావు, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్‌లు డుమ్మా కొట్టడం కమలం పార్టీలో కలకలం రేపుతున్నది..ఇప్పటికే వీరంతా ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ కార్యచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మోడీ సభతో అంతా దారికి వస్తుందనుకుంటునప్పటికీ అటుంటిదేమి లేదు అన్నట్లుగా అసంతృప్త శిబిరంలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వారిలో కొంత మంది నేతలు పాలమూరు మోడీ సభకు దూరంగా ఉండిపోయారు. దీంతో వీరంతా పార్టీ మారడం పక్కా అని అందుకోసమే ప్రధాని సభకు ఆబ్సెంట్ అయ్యారనే వాదనలు మరింత బలపడుతున్నాయి..
తెలంగాణలోని పలువురు సీనియర్ లీడర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. సభలో,
స్టేజీపైనా మాజీ ఎంపీలైన విజయశాంతి, వివేక్, అలాగే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కనిపించలేదు. అలాగే సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు…
స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి, సభ నిర్వహించినా వీరంతా ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని విషయం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. వీరంతా హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యతతో పాటు పదువులు ఇవ్వడం వల్ల వీరంతా అధిష్టానంపై అలకబూనిటనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్ర నుంచి పెద్ద నాయకులు వచ్చినా కలవకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.