తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు..

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు నిన్నటితో 900పైగా దరఖాస్తులు..!

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో రాష్ట్రంలో మరింత హీట్‌ పెరిగిపోయింది. వారి జాబితా విడులైనప్పటి నుంచి ఇతర పార్టీలు సైతం జోరందుకున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల మూడు వారంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి వెయ్యికి పైగా దఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల జాబితాను పరిశీలించి వారి పేర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ముందుగా తొలి జాబితాను విడుదల చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది..

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు..

దరఖాస్తులకు ఎటువంటి రుసుము లేనందున ఒక్కొక అభ్యర్థి 3, 4 అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులకు 10వ తేదీ వరకు గడువు ఉండడం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది…