త్వరలో 20 మందికి నామినేటెడ్ పోస్టులు: సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషిచేసిన నేతలకు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజక వర్గం నుంచి సుమారుగా నా లుగు నుంచి ఐదు పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది.అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం.

త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కూడా వారి పేర్లకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించి నట్టుగా సమాచారం.

ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్‌ను కల్పి స్తూ అడ్వైయిజర్ పోస్టులు ఇవ్వగా, త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.

*టిపిసిసి, ఏఐసిసిల సమన్వయంతో పోస్టుల భర్తీ*

మిగిలిన 30 నుంచి 40 పోస్టులను ఈనెలాఖరు లోగా మిగతా వారికి కేటాయించాలని సిఎం రేవంత్‌కు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సిఎం రేవంత్ పంపించిన జాబితాకు ఢిల్లీ నుంచి ఆమోదం ముద్రపడగానే ఆ జాబితాలోని పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి….