టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు ఇవ్వడం లేదు:బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.

**

AP: చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన రేపటి రాష్ట్ర బంద్కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు తన లెటర్ ప్యాడ్తో పలు వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. తన లెటర్ ప్యాడ్తో సర్క్యులేట్ అవుతున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఫేక్ లెటర్ని సర్క్యులేట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.