ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులపై బీజేపీ నేత కీలక సంచలన వ్యాఖ్యలు

Adinarayana Reddy BJP : తెలుగుదేశం-జనసేన పొత్తుపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని స్పష్టం చేసారు. మాది జాతీయ పార్టీ… అధికారంలో ఉండే రాజకీయా పార్టీ అంటూ చెప్పుకొచ్చారు..ఇప్పటికే తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు వివరంగా వివరించామన్నారు. తాము కూడా టీడీపీ-జనసేన కూటమిలో చేరాలని హైకమాండ్‌కు తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిపారు. సీట్ల కేటాయింపుపై ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారా.. స్థానిక పరిస్థితులను బట్టి అవకాశాలు ఉండవచ్చని అన్నారు. టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించనప్పటికీ బీజేపీకి కూడా కొన్ని సీట్లు వస్తాయని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.