చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినందుకు స్వీట్లు పంచిన టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు..

చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినందుకు స్వీట్లు పంచిన టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు..
చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయం భగ్గుమంటోంది. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. మాకు టైమ్ వస్తుంది మేమేంటో చూపిస్తామని టీడీపీ నేతలు, కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు.
ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నిరసన కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పాల్గొంటుంటే.. అదే టిడిపి పార్టీలో ఉన్న అసమ్మతినేత చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకోవడం కొంత చర్చనీయా అంశంగా మారింది….

గతంలో తన పేరు రెడ్ బుక్ లో ఎక్కించారని, తనను చంపేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుట్ర చేస్తున్నాడంటూ…స్వయానా ఆ పార్టీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఢిల్లీలో ఈసీ ముందు ఫిర్యాదు చేశారు. లోకేష్ తన పేరును రెడ్ బుక్ లో ఎక్కించాడని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందంటూ ఈసీ ఎదుట ఆకుల వెంకటేశ్వరరావు గోడు వెళ్లబోసుకున్నాడు. టీడీపీ కోసం ఆస్తులు పోగోట్టుకున్నా అంటూ ఆవేదన చెందారు. జూబ్లిహిల్స్ లో తనకు చెందిన 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే.ఎల్. నారాయణ లాక్కున్నాడని, న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. అందరిని వాడుకుని వదిలేసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు పార్టీ కోసం తనను కూడా వాడుకుని వదిలేసాడని, పార్టీ లేదు..బొక్కా లేదు అన్న అచ్చంనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారని ఆకుల వెంకటేశ్వరరావు విమర్శించారు. మొత్తంగా లోకేష్ రెడ్ బుక్ లో తన పేరు ఉందని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందంటూ ఈసీ ఎదుట టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరావు చేసిన ఫిర్యాదు రాజకీయవర్గాల్లో గత కొన్నిరోజుల క్రితం తీవ్ర చర్చనీయాంశంగా మారింది….

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అరెస్టుతో రోడ్డుపై స్వీట్లు పంచటం మరో చర్చనీయాంశంగా మారింది…