టిడిపి మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు..

*A.P & T.S Live Update News*

టిడిపి మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు

డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా?

పక్క రాష్ట్రాల వాళ్లకి, NRIలకు సీట్లు ఇస్తున్నారు

చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు

టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను తొక్కేస్తున్నారు

నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా సీటు ఇవ్వలేదు..

టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారని, చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వీడియో విడుదల చేశారు..