టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…!.

అమరావతి :

*టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…!.

విజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు…

రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు…

తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు – రాంబాబు వెంట పోలీసులతో పాటు వెళ్లిన ఆయన కుమార్తె..

జగన్‌ ప్రభుత్వ పథకాలను పొగిడినందుకు.. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ బారిన పడి.. తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గీతాంజలిని ట్రోల్‌ చేసిన వారి భరతం పట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు..