టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌ కార్ యాక్సిడెంట్.

టీం ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం …
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ దుర్ఘటనలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి…రూర్కీకి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.రూర్కీలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదం తర్వాత పంత్‌ను ఆసుపత్రిలో చేర్చారు.రిషబ్ పంత్ కాలికి బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు.అతనికి సర్జరీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.మెరుగైన చికిత్స కోసం పంత్‌ను డెహ్రాడూన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫార్సు చేశారు…
ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, రూర్కీ నుంచి డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు…