బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం…

టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై కాస్త కష్టంగానే అయినా, డక్ వర్త్ లూయిస్ విధానంలో ఐదు పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ రేసులో ముందంజ వేసింది. అడిలైడ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను ఓడించినంత పనిచేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించగా, బంగ్లాదేశ్ 6 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, అర్షదీప్ బౌలింగ్ చేశాడు. బంగ్లా బ్యాట్స్ మన్ నూరుల్ హుస్సేన్ ఓ సిక్స్, ఫోర్ బాదినా ఫలితం లేకపోయింది….

టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. మహ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది…
అంతకుముందు వర్షం రావడంతో కాసేపు మ్యాచు ఆగిపోయింది. దీంతో మ్యాచును 16 ఓవర్లలో 151..మ్యాచులో బంగ్లాదేశ్ సులువుగా లక్ష్యం చేదించినట్లే అనిపించింది… అయితే, వారి ఇన్నింగ్స్ లో ఓ ఆరు బంతులు మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది దీంతో భారత్ గెలుపు ఖాయమైంది…