కామంచి కుంట తండా గ్రామంలో ఘనంగా తీజ్ పండుగ..

మఠంపల్లి మండలంలోని కమంచీ కుంట తండా గ్రామంలో ఈ రోజు గిరిజనులు సంప్రదాయంా జరుపుకొనే తీజ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

ఆధునిక ప్రపంచంలోనూ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పక్కాగా ఫాలో అవుతున్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న పండుగలతో అందరిని ఆకట్టుకుంటారు ఈ గిరిజనులు. బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతినే ఆరాధించేవే ఎక్కువగా ఉంటాయి. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని బంజారాల విశ్వసిస్తారు. అందుకే వారు జరుపుకునే ప్రతి పండగలో ఏదో ఒక దైవాన్ని తలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ప్రతీఏటా శ్రావణ మాసంలో బంజార యువతులు తమ సంస్కృతి పరిరక్షణలో భాగంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.

యువతులు సంప్రదాయబద్దంగా ఉపవాసాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో గోధుమ బుట్టలో ఉన్న తీజ్‌లకు నీళ్లు పోస్తూ పూజలు నిర్వహిస్తారు.. సాయంత్రం సమయంలో పాటలు, నృత్యాలతో తండాల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతీ ఏటా శ్రావణమాసంలో లంబాడా తండాల్లో తొమ్మిది రోజుల పాటు తీజ్ ఉత్సవాలతో జిల్లాలోని గిరిజన తండాలు సందడిగా కనిపిస్తాయి.

బంజారా గ్రామాల్లో తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మొలకెత్తిన గోధుమల బుట్టలను ఒక్క చోటికి చేర్చి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.. యువతులు, మహిళలు చీమల పుట్టలో మట్టిని తీసుకొచ్చి నానబెట్టిన గోధుమలను అందులో పోసి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దు:ఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు.. *తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పండుగను కలిసి నిర్వహించుకోవడమే కాకుండా.. ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి గారు కృషి ప్రయత్నాలు చేయాలని స్థానిక సర్పంచ్ సునీత లాలు నాయక్ కోరుతున్నారు బంజారాలు.* ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్ద ధరావత్ సూక్కో నాయక్, సర్పంచ్ సునీత లాలు నాయక్, ఉప సర్పంచ్ సైదా నాయక్, వార్డు సభ్యులు రవి నాయక్, సునీత చంటి నాయక్, సంధ్య చంటి నాయక్, గ్రామ పెద్దలు శంకర్ నాయక్, రామకోటి నాయక్, నాగు నాయక్, ధర్మ నాయక్, కాళ్య నాయక్, దుబ్ సింగ్ నాయక్ తదితరులు గ్రామ ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు.