తెలంగాణాలో నిశ్శబ్ద విప్లవం వస్తుంది. రెండో స్థానంకోసం, మూడో స్థానంకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడతాయి – కిషన్ రెడ్డి.
తెలంగాణాలో నిశ్శబ్ద విప్లవం వస్తుంది. రెండో స్థానంకోసం, మూడో స్థానంకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడతాయి – కిషన్ రెడ్డి
ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తున్నాం రెండో స్థానంకోసం, మూడో స్థానంకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడతాయి. నిశ్శబ్ద విప్లవం తెలంగాణాలో వస్తుంది. మూడు దశలలో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తాం అన్నారు…తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా పోరాడుతాం. ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుంది. ప్రజలు కుటుంబం, నియంతృత్వం, దుర్మార్గం, ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోటీ చేస్తే తెలంగాణలో విప్లవం వస్తుంది .
ఉద్యమ ద్రోహులు ఫాంహౌజ్ , ప్రగతి భవన్ కు చేరారు . ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. డబ్బు, మద్యం, ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు…