తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవికి రాజీనామా..!

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంజయ్ తన రాజీనామాను సమర్పించారు. కేంద్రంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరూ వినిపించింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది సాయంత్రం వెలువడే అవకాశాలు ఉన్నాయి.