21న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రుణమాఫీపై చర్చించే అవకాశం..!

21న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రుణమాఫీపై చర్చించే అవకాశం..!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో..

ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ రూపకల్పన, పంటల బీమాపైనా క్యాబినెట్‌ చర్చించనున్నట్లు తెలిసింది.