తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్..

మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుండి అయన సతీమణి పద్మావతి కోదాడ నుండి పోటీలో ఉన్నారు.

సీనియర్ లీడర్ జానారెడ్డి ఎంపీ స్థానంలో పోటీలో ఉంటానని, తన ఇద్దరు కుమారులు జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ స్థానాలు ఆశిస్తున్నారు.

దామోదర రాజనర్సింహ మరియు అయన కుమార్తె త్రిష ఇద్దరికీ టికెట్ ఆశిస్తున్నారు.

సీతక్క ములుగు నుండి తన కుమారుడు సూర్యకి పినపాక నుండి టికెట్ ఆశిస్తుంది.

అంజన్ కుమార్ యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవుకు టికెట్ ఆశిస్తున్నారు.

కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరికీ టికెట్ ఆశిస్తున్నారు.

మైనంపల్లి హన్మంత్ రావు తనకి తన కుమారుడికి టిక్కెట్లు ఖరారు అయినందుకే పార్టీలో వచ్చినట్టు తెలిపారు.

రేఖ నాయక్ ఖానాపూర్, ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ టిక్కెట్లు ఆశిస్తున్నారు.