తెలంగాణలో రేపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల…

రేపు విడుదల కానున్న కాంగ్రెస్ మానిఫెస్టో

“పసుపు కుంకుమ” పేరుతో మారనున్న కళ్యాణ లక్ష్మి పథకం.. లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం…

ధరణి స్థానంలో కొత్తగా “భూ భారతి” పోర్టల్..

హైదరాబాద్ కు రానున్న మల్లికార్జున ఖర్గే రేపు మధ్యాహ్నం తాజ్ కృష్ణ హోటల్ లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.సాయంత్రం కుత్బుల్లాపూర్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు…అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేపు రాష్ట్రానికి రానున్నారు.పినపాక, పరకాల, వరంగల్ తో పాటు రాజేంద్రనగర్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.