తెలంగాణ ఎన్నికల కోసం 17 స్థానాల్లో పోటీ చేయడానికి సీపీఎం మొదటి లిస్టు విడుదల..

సీపీఎం కాంగ్రెస్ పొత్తు తెగతెంపులు

తెలంగాణ ఎన్నికల కోసం 17 స్థానాల్లో పోటీ చేయడానికి సీపీఎం మొదటి లిస్టు విడుదల..

తెలంగాణ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదన్నారు. ఖమ్మం, భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాలనుంచి సిపిఎం అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆయన తెలిపారు.

బీజేపీని తెలంగాణాలో ఒక్క సీట్ గెలవనియ్యం – సీపీఎం తమ్మినేని వీరబద్రం

బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో సీపీఎం నిలబడదు. మునుగోడులో లాగా ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తాం.

రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. సిపిఐ కలిసివస్తే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేపడతామన్నారు. ఈ పదిహేడు చోట్ల కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా బిజెపి గెలుపునకు అవకాశం ఉన్నచోట్ల ప్రత్యర్థి పార్టీలకు మద్దతు ఇస్తామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బిజేపిని గెలవనివ్వమని వీరభద్రం చెప్పారు. ‘లెఫ్ట్ ని గెలిపించండి& సిపిఎంని అసెంబ్లీకి పంపించండి’ అనేది తమ నినాదమన్నారు.