తెలంగాణ ఎన్నికల్లో నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం..

Hyderabad: తెలంగాణ ఎన్నికల్లో నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక నిర్ణయం (key Decision) తీసుకుంది..

ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెట్టాలని నిర్ణయించింది. సహాయంగా వచ్చే వ్యక్తి కూడా అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని, అతను ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని ఈసీ స్పష్టం చేసింది..

ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారని వివరించింది. కాగా ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ (Mock Polling) ప్రారంభిస్తారని, పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చునని ఎన్నికల కమిషన్ పేర్కొంది..