*తెలంగాణలో అక్టోబర్ 6 లేదా7న ఎన్నికల షెడ్యూల్..?*
▪️డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్..?
▪️కేంద్రం ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు..
▪️3న సీఈసీ బృందం హైదరాబాద్ రాక…
▪️అదే రోజు రాజకీయ పార్టీలతో భేటీ…
▪️4న అధికారులతో సన్నద్ధతపై సమీక్ష..
▪️ఓటర్లు తుదిజాబితా ప్రకటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది…
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిలోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ గురించి ముందస్తుగా సమాచారమేదీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి అధికారులు తెలంగాణలో పర్యటనకు వచ్చారు.
హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్.. ఇక్కడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి మాట్లాడారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దాలని సూచించారు. రిటర్నింగ్ అధికారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు…
దాదాపు అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చారు..!
కాకపోతే డేట్ ఎప్పుడు అన్నదే ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది దాదాపు అక్టోబర్ 6 లేదా7న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండవచ్చని రాజకీయ వర్గాలు జోరుగా సాగుతున్నా ప్రచారం..