తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు…

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..
ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు…
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు….

సహచర మంత్రులతో కలిసి వివరాలు వెల్లడించిన కేటీఆర్ గారు

వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించాం.
తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.

ప్రజా రవాణా ను పతిష్టపరిచేందుకు
టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం
43వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు,క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం..

3న జరిగే శాసన సభలో ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు.

హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని నిర్ణయం
మూడు నాలుగేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి పంపుతాం
రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానం.

వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టు కు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం

హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉంది.
హాకింపేట ఎయిర్పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం

మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం

రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధి పై క్యాబినెట్ లో పలు నిర్ణయాలు

వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం.
కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలి.అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలి!!..

సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వడం జరిగింది’ అని కేటీఆర్‌ తెలిపారు…