తెలంగాణ లొ హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారు.. ఎమ్మెల్సీ కవిత..

మూడో సారి సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని పేర్కొన్నారు.అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్‌ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు..