తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఎస్‌ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..!

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఎస్‌ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది…ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు అరెస్ట్ అయ్యారు. శనివారం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన అధికారులు.. అనంతరం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ఎస్పీలు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు పోలీసుల కస్టడీలో సంచలన వెల్లడించినట్లు సమాచారం.

మాజీ ఐపీఎస్ ప్రభాకర్ ఆదేశాల మేరకే ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో ప్రణీత్ రావు కస్టడీ ముగియనుండటంతో పోలీసులు నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్‌ఐబీలో తిరుపతన్న, భుజంగరావులు అడిషనల్ ఎస్పీలుగా పని చేశారు. ఈ సమయంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల కస్టడీలో ప్రణీత్ రావు ఇచ్చిన వివరాల ఆధారంగా తిరుపతన్న, భుజంగరావులను ప్రశ్నించిన పోలీసులు..