ఆంధ్రాలో నల్గొండ పోలీసులపై. మరియూ వాహనంపైనా దాడి..!!

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సతీష్‌తోపాటు వారి సిబ్బందిపై వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్యగారిపల్లెలో గురువారం రాత్రి దాడి జరిగింది..పోలీసు వాహనంపైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నయ్యగారిపల్లెకు చెందిన ఓబుగాని శివతోపాటు మరికొందరు నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రూ.30 లక్షల మేర అప్పు పెట్టారు. ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు పదిరోజుల కిందట చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు..ఎస్‌ఐ సతీష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిన్నయ్యగారిపల్లె చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివతోపాటు మరో పది మంది.. ఎస్‌ఐ, ఇతర సిబ్బంది, వాహన డ్రైవరు తదితరులపై దాడి చేసి గాయపరిచారు…