తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల.. తుది జాబితాలో 3.17 కోట్లకు పైగా ఓట్లు…

తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల.. తుది జాబితాలో 3.17 కోట్లకు పైగా ఓట్లు.

మొత్తం ఓటర్లు – 3,17,17,389
పురుషు ఓటర్లు – 1,58,71, 493
మహిళా ఓటర్లు – 1,58,43,339
ట్రాన్స్ జెండర్ ఓటర్లు – 2,557.

రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి.

మొత్తం ఓటర్లలో ట్రాన్స్‌జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్‌ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్‌ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇక 3.17 కోట్లకు పైగా ఉన్న ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితా స్పష్టంచేసింది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది…