*తెలంగాణ భవన్ లో టీఆరెస్ పార్టీ సంయుక్త సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ..!
*12 గంటల వరకు భవన్ నుంచి వెకేట్ చేయాలని ఆదేశాలు జారీ..
ప్రజాప్రతినిధుల మొబైల్ కూడా సమావేశానికి అనుమతి లేనట్లుగా ప్రచారం..!!!
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ పక్షం(ఎమ్మెల్యేలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం సోమవారం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే… సీఎం కేసీఆర్ అత్యవసరంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది….
మీడియా మొత్తాన్ని కూడా తెలంగాణ భవన్లోకి అనుమతించకపోవడం మరో హార్ట్ టాపిక్ గా మారింది… అంతేకాకుండా నాయకులకు ఫోన్లో సైతం కూడా అనుమతి లేదంటూ మరో పక్కన ప్రచారం నడుస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే తెలంగాణ భవన్ లో వాడి వీడిగా చర్చ జరగబోతుందని మిగతా నాయకుల్లో వ్యక్తం అవుతున్న విషయం…