షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టారు. అది కూడా.. ఆయన చెల్లెలు షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఓ తెలుగు న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల చుట్టూ ఎక్కువగా నడించిందీ బిగ్ డిబేట్. వైఎస్ జగన్ పరిపాలన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీదా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేసుకున్నారాయన ఈ సందర్భంగా.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటివరకు వైఎస్ జగన్.. తనకు ఫోన్ కాల్ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రలు ఫోన్ చేసి, అభినందిస్తుంటారని, ఇప్పటి వరకు జగన్ నుంచి అలాంటి కాల్ రాలేదని చెప్పారు.