తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభ్వుత్వం అమోదం తెలిపింది. విద్వేష పూరిత ప్రసంగాల నిరోధక బిల్లు, గిగ్‌ కార్మికుల సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలానే.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు ప్రభుత్వం ఒకే చెప్పింది…తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు, కుల గణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పన కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివ‌ర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది..

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.

ఎంప్లాయ్‌ పేరెంట్‌ వెల్ఫేర్‌ బిల్లుకు ఆమోదం.

హేట్‌ స్పీచ్‌ ప్రొటెక్షన్‌పై చర్చించిన కేబినెట్‌.

అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.

కులగణనపై స్వతంత్ర నిపుణుల క‌మిటీ ఇచ్చిన..

నివేదికను ఆమోదించిన తెలంగాణ కేబినెట్
రోహిత్ వేముల చ‌ట్టం విధివిధానాల రూప‌క‌ల్పన‌కు..

కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటుకు ఆమోదం
భట్టి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు
సభ్యులుగా దామోద‌ర, శ్రీ‌ధ‌ర్‌బాబు, ఉత్తమ్‌, పొన్నం..

తల్లిదండ్రుల మద్దతుబిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం..