షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు… సీఎం కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌ర్వేల‌న్నీ మ‌న‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌
లో జ‌రుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు…ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు…