ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు…

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే ఆయన ఎప్పుడు కాషాయ కండువా కప్పుకుంటారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. మోదీ పాలన మెచ్చి పార్టీలో చేరేందుకు నేతలు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు అంతా కృషి చేస్తామన్నారు. పాలమూరు జిల్లాలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వారికి సత్తా చూపించామన్నారు. కాంగ్రెస్ బలహీనం అయిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందంటున్నారు బండి సంజయ్‌ అంతే కాకుండా కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా డేట్ సమయం కుడా త్వరలోనే పిక్స్ అవుతుందని, ఉప ఎన్నిక అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. చాలా మంది బీజేపీలో చేరుతారని, రాజ్ గోపాల్ రెడ్డి రాకతో పార్టీ మరింత పెరుగుతుందన్నారు…