తెలంగాణలో కమలం వికసించబోతోంది..ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలొ అమిత్ షా.

బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని మండిపడ్డారు..

తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించిన అమిత్‌షా, బీజేపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు టైమ్‌ దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి బస్సుయాత్రలు ప్రారంభించాలని సూచించారు. రోడ్ మ్యాప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఏ పార్టీతో పొత్తులుండవని, ఎన్నికల రణరంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు అమిత్‌ షా.
తెలంగాణలో కమలం వికసిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..

*కేసీఆర్‌ సర్కారును గద్దె దింపాలా వద్దా?: ఖమ్మంలో అమిత్‌షా*

బీజేపీ సర్కారు కావాలా వద్దా?:

తిరుపతి వెంకటేశ్వరుడిని స్మరించుకుని ప్రసంగం ప్రారంభం….

స్తంభాద్రి లక్ష్మీనరసింహుని స్మరించుకుని ప్రసంగం ప్రారంభిస్తా..

తెలంగాణ విమోచనకు పోరాడిన స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పిస్తున్నా..

సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంది..

కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పని చేస్తుంది..

కేసీఆర్‌ సర్కారు తిరోగమనం ప్రారంభమైంది..

కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి..

ఒవైసీ పక్కన కేసీఆర్‌ కూర్చుని..తెలంగాణ విమోచన వీరులను అవమానిస్తున్నారు

హైదరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయి

తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది

భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది

తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారు..

శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారు..

కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది..కానీ ఆలయం వరకూ వెళ్లదు..

కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉంది..

కేసీఆర్‌ గారూ..గుర్తుపెట్టుకోండి.. ఇక మీకారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదుఎంఐఎం చేతిలో స్టీరింగ్‌ ఉన్న కారు మనకు కావాలా?..

అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటలను అరెస్టులతో భయపెట్టాలని చూశారు…

ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్‌ కాదు.. కేటీఆర్‌ కాదు.. సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమే..

కాంగ్రెస్‌ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ..

తెలంగాణ అధికారంలోకి వచ్చేది మోదీజీ పార్టీ..

కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు..